తెలంగాణలో 3 రోజుల పాటు నిర్మల సీతారామన్ పర్యటిస్తారని..తెలంగాణ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లో సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో పర్యటించనున్నారన్నారు.
కేంద్ర భారీ పరిశ్రమలు శాఖ మంత్రి శ్రీ మహేంద్ర నాత్ పాండే మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం లో సెప్టెంబర్ 3,4 తేదీల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను పేద బడుగు బలహీన వర్గాలకు అందుతున్న విధానం అమలు జరుగుతున్న పద్ధతులను తెలుసుకుంటారు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడంతోపాటు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ వస్తున్న నిధులు వినియోగం తెలుసుకుంటారు పార్టీ కార్యకర్తలతో నాయకులతో వివిధ సమావేశాల్లో పాల్గొంటారు.
ఆగస్టు 28, 29, 30 తేదీలలో కేంద్ర పోస్టల్ మరియు కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి భువనగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఆగస్టు 29 30 తేదీలలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కేంద్ర సహకార మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ బి ఎల్ వర్మ పర్యటించారు. కేంద్ర మంత్రులు పర్యటిస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పట్ల నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం, పేద, బడుగు వర్గాలను సమాజంలో ఉన్నత స్థానానికి తీసుకురావడానికి చేస్తున్న కృషిని ప్రజలు కేంద్ర మంత్రులకు సంతోషంతో వివరిస్తున్నారు.