సీఎం జ‌గ‌న్ విధానాల వ‌ల్లే ఆర్థిక సంక్షోభం : టీడీపీ నేత య‌న‌మ‌ల‌

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విధానాలు, చేత కాని త‌నం వ‌ల్లే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంద‌ని ఏపీ శాస‌న మండ‌లి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు విమ‌ర్శించారు. ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జార‌డానికి కార‌ణాల‌పై ప్ర‌భుత్వం అబద్ధాలు చెబుతుంద‌ని ఆరోపించారు. జ‌గ‌న్ చేత‌కానిత‌నం, మొండిత‌నం, అహం వ‌ల్లే రాష్ట్ర ప‌రిస్థితి ఇలా మారింద‌ని అన్నారు. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎన్న‌డూ కూడా ఇలాంటి ప‌రిస్థితి ఎదురు కాలేద‌ని అన్నారు. రాష్ట్ర ఆదాయం.. కేంద్ర నిధులతో క‌లిపి.. రూ. 1.25 ల‌క్షల కోట్ల కంటే ఎక్కువ వ‌చ్చాయ‌ని అన్నారు.

yanamala ramakrishnudu

ఆదాయంలో దేశంలో చాలా రాష్ట్రాల కంటే ముందు వ‌రుస‌లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం ఉంటుంద‌ని అన్నారు. కానీ రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌ని తీరు మాత్రం అట్ట‌డుగున ఉంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రెవెన్యూ లోటు 2021-22 లో రూ. 52,291 కోట్లు అధికంగా పెరిగింద‌ని అన్నారు. ద్ర‌వ్య‌లోటు రూ. 43,386 కోట్లు అధికంగా పెరిగింద‌ని అన్నారు. అలాగే గ్యారంటీ బ‌డ్జెట్ మ్యాన్యువ‌ల్ ప‌రిమితి కూడా 90 శాతం నుంచి 180 శాతానికి పెరిగాయ‌ని అన్నారు. ఇలా మార‌డానికి కార‌ణం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దోపిడీయే అని ఆరోపించారు.

ఈ మూడు ఏళ్ల‌లో రాష్ట్రం రూ. 4,83,791 కోట్లు అని అన్నారు. కానీ రాష్ట్ర కోసం రూ. 1.20 ల‌క్షల కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశార‌ని అన్నారు. మిగిలిన రూ. 3,63,791 కోట్లు ఎక్క‌డికి పోయాయని ప్ర‌శ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news