వామ్మో… వాట్సాప్‌లో రెడ్‌ హార్ట్‌ ఎమోజీ పంపిస్తే.. రూ. 20 లక్షల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష..!  

-

ప్రపంచం మొత్తం వాట్సప్ వాడుతోంది. ఇందులో మనం రోజు ఎన్నో షేర్ చేసుకుంటాం..ఎమోజిస్, స్టిక్కర్స్, గిఫ్ లు ఇలా మాటలకంటే..ఇవే ఎక్కువగా పంపుకుంటూ ఎంజాయ్ చేస్తారు కాదా..అయితే ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో అందుబాటులో ఉన్న ఈ మెసేజింగ్ యాప్స్‌పై పలు దేశాలు రకరకాల నిబంధనలు విధిస్తున్నాయి. కొన్ని దేశాలు తమ కంట్రీకి చెందిన యూజర్ల వాట్సాప్‌ హిస్టరీని తమ దేశంలోని సర్వర్లలోనే స్టోర్ చేయాలని కోరితే, మరికొన్ని యూజర్ల డేటాకు భద్రత కల్పించాలంటూ నిబంధనలు పెడుతున్నాయి.
తాజాగా సౌదీ అరేబియా వాట్సాప్‌ యూజర్లకు ఒక షరతును విధించింది. వాట్సాప్‌లో ‘రెడ్‌ హార్ట్‌’ ఎమోజీని ఎదుటి వ్యక్తి అనుమతి లేకుండా పంపిస్తే వేధింపులతో సమానమైన నేరంగా ప్రకటించేసింది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన యాంటీ ఫ్రాడ్‌ అసోసియేషన్‌ సభ్యుడు అల్‌ మోతాజ్‌ కుత్బీ తెలిపారు. ఇలా రెడ్‌ హార్ట్‌ ఎమోజీని పంపించిన వారికి 1 లక్ష సౌదీ రియల్స్‌.. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 20 లక్షల జరిమానా విధిస్తారట. ఒకవేళ ఇదే నేరంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు దోషిగా తేలితే ఏకంగా రూ. 60 లక్షల రూపయాలతో (3 లక్షల రియల్స్‌) పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని తెలిపారు.
సౌదీలో ఎదుటి వాళ్ల అంగీకారం లేనిదే వారితో చాట్‌ చేయడాన్ని కూడా నేరంగానే పరిగణిస్తారు. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే రీతిలో మెసేజ్‌లు చేసినా నేరమే. ముఖ్యంగా రెడ్‌ హార్ట్‌ ఎమోజీల విషయంలో మరి జాగ్రత్తగా ఉండాలని అల్ మోతాజ్ కుత్బీ సూచించారు. ఒక వ్యక్తి ఆత్మగౌరవానికి చేతల ద్వారా లేదా మాటల ద్వారా భంగం కలిగిస్తే దాన్ని సౌదీ అరేబియా చట్టం ప్రకారం వేధింపుల కింద పరిగణిస్తారు. ఇందులో భాగంగానే రెడ్‌ హార్ట్‌ ఎమోజీ విషయంలో ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారు..
ఇక పొరపాటున కూడా రెడ్ హార్ట్ ఎమోజిపైకి చేతులు పోవేమో కదా..ఇమాజిన్ మన దగ్గర ఇలాంటి రూల్స్ వస్తే..మనం ఫ్రెండ్స్ తో షాట్ చేసుకునేప్పుడు కూడా సందర్భానుసారం లవ్ ఎమోజిస్ షేరు చేసుకుంటాం..మన చేతులు అస్సలు ఆగవు కదా..!

Read more RELATED
Recommended to you

Latest news