తమ్ముళ్ల విషయంలో తప్పు మీద తప్పు చేస్తున్న జగన్!

-

తెలిసే చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ… టీడీపీ నేతల విషయంలో సీఎం జగన్ తప్పు మీద తప్పు చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజకీయంగా దెబ్బ మీద దెబ్బ తిని అచేతన స్థితిలో ఉన్న టీడీపీకి పరోక్షంగా జాకీలు బిగించేపనికి పూనుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే.. అలాంటి కామెంట్లకు రోజు రోజుకీ బలం చేకూరుస్తుంది జగన్ ప్రవర్తన!

Ys-Jaganmohan-Reddy
Ys-Jaganmohan-Reddy

ప్రస్తుతం ఏపీలో టీడీపీ ఉన్న పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రారంభమైన డౌన్ గ్రాఫ్… స్థానిక సంస్థలు – పరిషత్ ఎన్నికలు అనే తారతమ్యాలు ఏమీ లేకుండా ఇంకా దిగజారిపోతుంది! రాజకీయంగా తండ్రి చాటుబిడ్డగా ఉన్న లోకేష్ విషయంలో… ఇప్పటికే అత్యుత్సాహం ప్రదర్శించిన జగన్… లోకేష్ కు మీడియాలో ఫుల్ కవరేజ్ దొరికేలా చేశారు. ఎక్కడికక్కడ పోలీసుల మొహరింపు, అరెస్టులతో లోకేష్ కు ఊహించని మైలేజ్ తెచ్చిపెట్టారు.

ఇప్పుడు అదేక్రమంలో… టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు – రామానాయుడు విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు జగన్ & కో! అవును… తాజాగా సమావేశమైన అసెంబ్లీ ప్రివిలైజ్ క‌మిటీ ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని వ్య‌క్తిగ‌తంగా దూషించారనే కారణంతో “టీడీపీ శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు ఈ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగిన‌న్ని రోజులూ.. మైక్ ఇవ్వ‌కూడ‌దు” అనేది ఆ నిర్ణయం!

దీంతో… అసెంబ్లీ స‌మావేశాల్లో అచ్చెన్నాయుడు, రామానాయుడికి మైక్ ఇవ్వ‌కూడ‌ద‌నే తీర్మాణాన్ని స్పీక‌ర్‌ కు పంపనుంది ప్రివిలైజ్ క‌మిటీ.

అయితే… అచ్చెన్నకు, రామానాయుడికి జగన్ & కో బయపడిపోయారని వారి అనుకూల మీడియా వారిని ఆకాశానికి ఎత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫలితంగా జగన్ విలన్ అవ్వగా – వారిరువురూ హీరోలు అయ్యే అవకాశం ఉంది!

కాగా… గత ప్రభుత్వ హయాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సర్కార్ కూడా… జగన్ & కో ని ముప్పుతిప్పలు పెట్టింది – ఊహించని రీతిలో అవమానించింది – ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారనే విమర్శను సంపాదించుకుంది – ఫలితంగా 2019 ఎన్నికల్లో ఫలితం అనుభవించింది! మరి జగన్ కూడా… జనాల్లోకి అలాంటి సంకేతాలు పంపితే మాత్రం… “చాలా బాగోదు” అని గ్రహించాలి!

Read more RELATED
Recommended to you

Latest news