హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ అబిడ్స్ గన్ ఫౌండ్రి లోని ఓ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చెప్పుల గోదాం, హోటల్, మందుల దుకాణాలలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ లతో మంటలు ఆర్పేశారు. దుకాణంలో ఉన్న చెప్పులు, హోటల్ కు సంబంధించిన ఫర్నీచర్ పూర్తిగా అగ్నినికి ఆహుతి అయ్యాయి. ఇక మరో పక్క చోడవరంలో పండగ పూటే అపశ్రుతి చోటు చేసుకుంది.

తారాజువ్వ్వలు తాయారు చేస్తుండగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ముగ్గురు పిల్లకి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక గుజరాత్‌ లో కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది. వల్సాద్‌ లోని ప్లాస్టిక్‌ కంపెనీలో మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే కంపెనీ మొత్తం వ్యాపించాయి. ప్లాస్టిక్‌ తయారీ ముడి సరుకు ఉండటంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాద సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.