ఏరువాక పౌర్ణమి అంటే ఏమిటి..?, విశిష్టత, ప్రత్యేకత మొదలైన వివరాలు ఇవే..!

-

వ్యవసాయ పనులు మొదలు పెట్టడానికి రైతులు ముందు వాళ్ళ యొక్క పొలం లో పూజలని చేస్తారు. నిన్నో, మొన్నో వచ్చినది కాదు ఇది. అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం ఇది. పొలాల్లో ఎద్దులతో నాగలితో దుక్కి దున్నడాన్ని ఏరువాక అని పిలుస్తారు, ఏరు అంటే ఎద్దులు కట్టి దున్నడం అని. ఏరువాక పున్నమి రోజునే వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. అయితే ఎందుకు అప్పుడే ఈ పనులు మొదలు పెట్టాలి…? ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి ఆనేది తెలుసుకుందాం.

జ్యేష్ఠ నక్షత్రం వేళ నాగలి సారించి పనులు మొదలు పెట్టేందుకు మంచి రోజు. వర్ష బుుతువు ప్రారంభం కాగానే ఉదయాన్నే రైతులు ఎడ్లను శుభ్రం చేస్తారు. వాటి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, పూల తో వాటిని అలంకరిస్తారు. ధూప దీప నైవేద్యాలతో పూజలు చేస్తారు. కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి బొబ్బట్లు కూడా పెడతారు. ఆ తరవాత పొలానికి వెళ్లి భూమాతకు కూడా పూజలు చేస్తారు.

ఏరువాక పున్నమి సాయంకాలం రంగు రంగుల బట్టలతో ఎడ్లను అలంకరించి… ఆ తరవాత డప్పులు, మేళతాళాలతో ఊరేగిస్తారు. వాటికి ఏ రోగాలు రాకుండా ఉండేందుకు ఆయుర్వేద మందులను, నూనెలను కూడా తాగిస్తారు. కొన్ని చోట్ల అయితే ఊరు బయట గోగునారతో తోరాలు చేసినవి తీసుకుని కడతారు. రైతులు అక్కడకి వెళ్లి చెర్నాకోలతో ఆ తోరాలను కొట్టి ఎవరికి దొరికిన నారను వాళ్ళు ఎద్దుల కి మెడలో కడతారు. ఇలా చేయడం వలన పశు సంపద వృద్ది జరుగుతుందని భావిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news