కరోనా కొత్త రూపాంతరాలు కలవరపెడుతున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా డెల్టా రకం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతున్నాయని అనుకుంటే డెల్టా ప్లస్ రకం అని కొత్త వేరియంట్ బయటకి వచ్చింది. ఈ వేరియంట్ విస్తరణ తీవ్రంగా ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని వార్తలు భయపెడుతూనే ఉన్నాయి. ఆ భయాన్ని మరింత చేయడానికా అన్నట్టు తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదైంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లాలో డెల్టా ప్లస్ మరణం సంభవించింది.
ఈ విషయంలో స్పందించిన ప్రభుత్వం, టీకా వేసుకోనందు వల్లే మరణం సంభవించిందని, టీకా వేసుకున్న నలుగురు డెల్టా ప్లస్ వైరస్ నుండి రికవరీ అయ్యారని, ప్రజలంతా టీకాలు వేసుకోవాలని అంటున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో 12డెల్టా ప్లస్ వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఆలోచనలో పడి అప్రమత్తమైంది. భయాందోళనలకి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మూడవ వేవ్ ని అడ్డుకోవచ్చని చెబుతుంది.