NC22 : పోలీసుల “కస్టడీ” లో నాగచైతన్య

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగ చైతన్య.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ… ముందుకు సాగుతున్నారు. ఇందులో NC 22 పేరుతో ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాకపోయినా.. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం రివీల్‌ చేసింది.

ఇప్పటికే ఈ జంట బంగార్రాజు సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్‌ ను వదులుతోంది చిత్ర బృందం. ఈ సినిమాలో ప్రియమణీ నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది చిత్ర బృందం. ఇక ఇవాళ మరో అప్డేట్‌ ను ఇచ్చేసింది చిత్ర బృందం. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ , టైటిల్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. NC 22 పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు కస్టడీ అనే టైటిల్‌ ను అనౌన్స్‌ చేశారు. ఈ మేరకు చైతూ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news