భారత వాయుసేనలోకి తేలిక పాటి యుద్ధ హెలికాప్టర్ ‘ప్రచండ్’

-

భారత అమ్ములపొదిలోకి మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌ ‘ప్రచండ్‌’  భారత వాయుసేన అమ్ములపొదికి చేరింది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌  నాలుగు హెలికాప్టర్లను లాంఛనంగా భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు.

ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో మోహరింపు కోసం రూపొందించిన ‘ప్రచండ్‌’ హెలికాప్టర్లను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని ‘ప్రచండ్‌’ ఎల్‌సీహెచ్‌లను సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు భారత వాయుసేన అధికారులు వెల్లడించారు.

భారత సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో తేలికపాటి హెలికాప్టర్లను (ఎల్‌సీహెచ్‌) సమకూర్చేందుకు 2020 మార్చిలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన భద్రతా కేబినెట్‌ కమిటీ ఆమోద ముద్ర వేసింది. తొలుత 15 హెలికాప్టర్ల కోసం రూ.3887 కోట్లను కేటాయించింది. వీటిలో 10 హెలికాప్టర్లు భారత వాయుసేనలోకి, మరో ఐదింటిని ఆర్మీకి కేటాయించారు. నేడు జరిగిన కార్యక్రమంలో నాలుగు ప్రచండ్ హెలికాప్టర్లను వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news