రవితేజ ‘రావణాసుర’ నుంచి ‘ప్యార్ లోనా పాగల్’ ప్రోమో రిలీజ్

-

ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ డూపర్ విజయాలు అందుకున్న రవితేజ, ప్రస్తుతం రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ధమాకాతో వందకోట్లు, వాల్తేరు వీరయ్యతో 200కోట్లు కొల్లగొట్టిన రవితేజ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అందువల్ల రావణాసుర సినిమా మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ షేడ్స్ లో కనిపించనున్నాడని అభిమానులు అనుకుంటున్నారు. చిన్నపాటి గ్లింప్స్ వీడియోలో ఎక్కువ రక్తం కనిపించడం, రవితేజ తప్ప ఇంకెవరూ లేకపోవడం, సినిమా పేరు రావణాసుర కావడం వల్ల ఆ విధంగా అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రావణాసుర నుండి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది.

ఇప్పటివరకు ఈ సినిమా నుండి రావణాసుర ఆంథెమ్ విడుదలైంది. ఇప్పుడు సెకండ్ సింగిల్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ సినిమా నుంచి ‘ప్యార్ లోనా పాగల్’ సాంగ్ ప్రోమోను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. పూర్తి సాంగ్‌ను ఈ నెల 18న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. అయితే, ఇప్పటికే వరస విజయాలతో దూసుకుపోతున్న రవితేజ అభిమానులు ‘రావణాసుర’పై భారీగా ఎక్స్పక్టేషన్స్ పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news