తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నాయి.ఎడతెరపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి..చెరువులు, రిజర్వాయర్లు నిండు కుండలను తలపిస్తున్నాయి.నిర్మల్ జిల్లా కేంద్రం మొత్తం నీట మునిగిపోయింది. వరద నీరు నిర్మల్ పట్టణంలోకి చేరడంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. వరద నీటిలో చేపలు కొట్టుకురావడంతో వాటిని పట్టుకునేందుకు జనం పరుగులు పెట్టారు..
చీరలు, వలలు వేసి దొరికిన చేపలను పట్టుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. నిర్మల్ పట్టణంలోని మంజులపూర్ చెరువుకు గండిపడింది. దీంతో చెరువులోని నీరంతా పట్టణంలోని రోడ్లు వీధులవెంట ప్రవహిస్తోంది. వరద నీటిలో చేపలు భారీగా కొట్టుకుపోతున్నాయి..
ఒక్కో చేప బరువు సుమారు 6 కిలోలకు మించి బరువున్నాయి. రోడ్లపై చేపలు దొరకుతున్న విషయం తెలిసి.. జనం వాటి కోసం ఎగబడ్డారు. ఎది దొకిరితే అది చేతబట్టుకుని చేపల వేట సాగించారు. కొందరు మత్స్యకారులు రోడ్లమీద, ఇంటి వాకిట్లోనే వలలు వేసిన చేపలు పట్టారు. దొరికినవారు ఎంచక్కా వాటిని సంచిలో వేసుకుని ఇంటికి తీసుకెళ్లారు. నిర్మల్ రోడ్లపై చేపల వేటకు సంబంధించిన వీడియోలు మరోమారు స్థానికులతో పాటు, నెటిజన్లను సైతం ఊరిస్తున్నాయి..ఇందుకు సంభందించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..