ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఏపీ మద్యంలో హానికర పదార్దాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందనీ,ప్రభుత్వం చెప్పిన ల్యాబులోనే పరీక్షలు చేయించడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు.జంగారెడ్డిగూడెం మరణాలకు కారణం కల్తీ మద్యం అని తేలిందన్నారు.జంగారెడ్డి గూడెం మరణాలపై పోస్ట్ మార్టం ఇప్పటి వరకూ ఇవ్వలేదనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ తప్పు చేయనప్పుడు జంగారెడ్డి గూడెం మరణాలపై పోస్టు మార్టం రిపోర్టు విడుదల చేయడానికి భయమెందుకు..? అని ప్రశ్నించారు.మద్యం షాపుల్లో డిజిటల్ కరెన్సీని ఎందుకు అమలు చేయడం లేద తెలపాలన్నారు.మద్యం నగదు నుంచి 30 శాతం జే ట్యాక్స్ కి వెళ్తుందన్నారు.జగన్ వచ్చిన తర్వాత 160 బ్రాండ్లకు అనుమతిచ్చారని,మద్యం అమ్మకాలపై సీబీఐ విచారణ జరపాలి.. అవసరమైతే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు.