ఐపీఎల్ లో ఫిక్సింగ్ కలకలం రేపుతోంది. కింగ్స్ లెవెన్ పంజాబ్ ప్లేయర్ దీపక్ హుడా పై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 4 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన పంజాబ్.. ఆ సమయంలో దీపక్ హుడా క్రీజులో ఉన్నారు. ఈ నేపథ్యం లో డక్ ఔట్ అయ్యాడు హుడా. మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు హూడా తన ఇన్‌స్టా ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
పంజాబ్ కింగ్స్ జట్టులో ప్లేయింగ్ లెవెన్ లో తాను ఆడుతున్నట్లు పోస్ట్ హూడా చేశాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏదైనా జట్టు తుది వివరాలు టాస్ వేసే సమయంలో కెప్టెన్ రిఫరీకి అందిస్తాడు. జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లైనా సరే తుది జట్టు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ టాస్‌కు ముందు బహిర్గతం చేయకూడదు. అయితే ఈ వివరాలను బయటపెట్టడంపై బీసీసీఐ సీరియస్ అయింది. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా అనుమానాస్పద ప్రవర్తన కారణంగా అతన్ని యాంటీ కరప్షన్ యూనిట్ నిఘా పరిధిలోకి తీసుకువచ్చింది. కాగా పోస్ట్‌ను అతను అనుకోకుండా పెట్టాడా లేదా బుకీలకు ఏదైనా హింట్ ఇద్దామని చేశాడా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.