కేసీఆర్ పై షర్మిల ఫైర్..తాగుబోతుల తెలంగాణగా మార్చిండు.!

తెలంగాణ లో పార్టీ స్థాపించిన షర్మిల ప్రతి రోజు తన కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. ఎదో ఒక కార్యక్రమం తో షర్మిల తెలంగాణ ప్రజలకు దగ్గర అవుతున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా షర్మిల సోషల్ మీడియా లో ఓ ట్వీట్ చేశారు. ఆరేళ్ల పాపపై జరిగిన దారుణం మరవకముందే నల్గొండ జిల్లాలో మరో దారుణం జరిగిందని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రం లో ఎక్కడ చూసినా మద్యం పారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sharmila
Sharmila

రాష్ట్రాన్ని కేసీఆర్ తాగుబోతుల తెలంగాణ గా మార్చిండు అంటూ ఫైర్ అయ్యారు. తాగిన మత్తులో అత్యాచారాలు చేస్తుంటే కేసీఆర్ తనకు ఏమీ పట్టనట్టు ఉన్నారంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఆడపిల్లల మానప్రాణాలను పణంగా పెట్టి లిక్కర్ ఆదాయాన్ని అదే విధంగా మహిళల పై అఘాయిత్యాలు 300 రెట్లు పెంచిండు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈరోజు నల్గొండ జిల్లాలో ఇద్దరు కామాంధులు మద్యం మత్తులో మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు.