చీరకు నిప్పంటుకుని నిండు గర్భిణి మృతి…!

హైద‌రాబాద్ లోని బాలాన‌గ‌ర్ ప్రాంతంలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. చీర‌కు నిప్పంటుకుని ఓ తొమ్మిది నెల‌ల నిండు గర్భిణి మృతి చెందింది. బాలాన‌గ‌ర్ లోని దాస‌రి బ‌స్తీకి చెందిన శివ‌రాణి తన భ‌ర్త పిల్ల‌ల‌తో క‌లిసి నివాసముంటోంది. ఈ నెల‌7వ తేదీన భ‌ర్త వేరే ఊరు వెళ్ల‌గా శివ‌రాణి త‌న త‌ల్లిగారి ఇంటి వ‌ద్ద ఉంటోంది. కాగా అదేరోజు శివ‌రాణి ఇంట్లో వంట చేస్తుండ‌గా ప్ర‌మాద‌వశాత్తూ చీర‌కు నిప్పంటుకుంది. ఆ మంట‌లు చెల‌రేగి ఆమె శ‌రీరం కాలిపోయింది. ముఖం మ‌రియు క‌డుపు భాగంలో తీవ్ర‌గాయాల‌య్యాయి.

pregnent women
pregnent women

కుటుంబ స‌భ్యులు మంట‌లు ఆర్పే లోపే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింపోయింది. దాంతో ఆమెను స్థానిక మ‌ల్లారెడ్డి ఆస్ప‌త్రికి చికిత్స కోసం త‌ర‌లించారు. కాగా చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించ‌డంతో శివ‌రాణి ఈనెల 23న‌ మృతి చెందింది. మొద‌ట క‌డుపులో ఉన్న శిశువు మృతి చెంద‌డంతో ఆమెకు ఆప‌రేష‌న్ చేశారు. ఈ క్ర‌మంలో శివ‌రాణి సైతం మ‌ర‌ణించింది. తొమ్మిది నెల‌ల గ‌ర్భంతో ఉన్న శివ‌రాణి మృతి చెంద‌డంతో ఆ కుంటుంబం విల‌పిస్తున్న తీరు ప్ర‌తిఒక్కరిణీ క‌ల‌చివేసింది.