World Digestive health day 2023: గట్ హెల్త్ బాగుండాలంటే.. వీటిని కచ్చితంగా పాటించండి..!

-

ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పై శ్రద్ధ పడుతూ ఉంటారు. ఆరోగ్యం బాగుండాలని అందుకోసం తగిన పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా జీర్ణ సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి దూరంగా ఉండాలి. జీర్ణ సమస్యలు ఏమైనా కలిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. గట్ హెల్త్ బాగుండాలంటే ఈ విషయాలని కచ్చితంగా గుర్తుంచుకోండి. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ ని అస్సలు తీసుకోవద్దు. ప్రాసెస్డ్ ఫుడ్ ని తీసుకుంటే ఇబ్బందులు కలగొచ్చు.

ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. అజీర్తి మొదలైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి గట్ హెల్త్ పై దృష్టి పెట్టాలి. ప్రాసెస్డ్ ఫుడ్ ని తగ్గించుకోవాలి. యాంటీబయటిక్స్ ఎక్కువగా ఉపయోగిస్తే కూడా గట్ బ్యాక్టీరియా పై ప్రభావం పడుతుంది కాబట్టి యాంటీ బయటిక్స్ ఎక్కువగా ఉపయోగించకండి. ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోయినా కూడా అజీర్తి మొదలైన సమస్యలు కలుగుతాయి. కాబట్టి ఫిజికల్ ఆక్టివిటీ పై కూడా దృష్టి పెట్టాలి.

గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఫైబర్ ఎక్కువగా ఉంటే కూరగాయలు పండ్లు అన్ని తీసుకుంటూ ఉండండి. హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యం. శరీరానికి సరిపడా నీళ్లు తీసుకుంటూ ఉండండి. ప్రోబయోటిక్స్ ఉండే కిమ్చి, యోగర్ట్ వంటి వాటిని కూడా డైట్లో చేర్చుకోండి అప్పుడు గట్ హెల్త్ బాగుంటుంది ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండేలా కూడా చూసుకోండి ఇలా ఈ విధంగా అనుసరించడం వలన గట్ హెల్త్ బాగుంటుంది. అజీర్తి మొదలైన ఇబ్బందులు నుండి దూరంగా ఉండొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news