ఈ ఆవుల్లో అధిక పాల దిగుబడి కోసం ఇలా ఫాలో అవ్వండి..!

-

Agriculture భారతదేశంలో ఎక్కువగా ఆవుల్ని పెంచుతూ ఉంటారు. వృత్తిగా భావించే చాలా మంది ఆవుల్ని పెంచుతూ ఉంటారు. చాలా మంది రైతులు ఆవులను పెంచే ఆదాయం పొందుతున్నారు. కొంత మంది అయితే ఏకంగా లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే  సంకర జాతి ఆవుల పెంపకం గురించి, వాటి వల్ల ఎలా అధిక పాల దిగుబడి పొందొచ్చు అనే దాని గురించి చూద్దాం.

సంకర జాతి ఆవు అయితే ఏడాది నుంచి సంవత్సరన్నర మధ్యలో ఎదకు వస్తుంది. దేశవాళి ఆవు అయితే మూడు నుండి నాలుగు ఏళ్ళు పడుతుంది. సంకర జాతి ఆవులు 300 రోజులు కూడా ఇవి పాలిస్తాయి. కానీ దేశవాళి ఆవులు అయితే 200 రోజులు మాత్రమే పాలు ఇస్తాయి. సంకరజాతి ఆవులు ఆరు నుండి ఎనిమిది లీటర్ల వరకు పాలు ఇస్తాయి. అంటే దేశవాళి ఆవులు కంటే మూడు నుండి నాలుగు రెట్లు ఎక్కువ పాలు ఇస్తూ ఉంటాయి.

కాబట్టి ఎలా చూసుకున్నా దేశవాళీ ఆవుల కంటే సంకర జాతి ఆవుల్ని ప్రిఫర్ చేయడం మంచిది. ఇవి అధిక ఆదాయాన్ని తీసుకొస్తాయి. ఇక సంకర జాతి ఆవుల ఖరీదు విషయానికి వస్తే.. రూ.15 వేల వరకు ఉంటుంది. ఇక వీటి పోషణ విషయానికి వస్తే..

పచ్చిమేత ఎండుగడ్డి దానా తగిన పరిమాణంలో ఇవ్వాలి. సుమారు 25 కిలోల జొన్న వంటి పచ్చిమేత తో పాటుగా సంకరజాతి ఆవు కు కావలసిన మాంసకృత్తులు మరియు తగిన పోషక పదార్ధాలు ఇవ్వాలి. చల్లటి నీటిని వాటికి అందేలా చూడాలి. ఇలా శ్రద్ధ తీసుకుంటే కచ్చితంగా సంకరజాతి ఆవులు ని బాగా పెంచవచ్చు అలాగే వాటి ద్వారా మంచి ఆదాయం పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news