ఒత్తిడి నుండి బయట పడాలంటే ఈ మార్గాలని అనుసరించండి..!

-

సాధారణంగా రోజువారీ పనులు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఒత్తిడి నుండి బయటపడాలంటే ఈ సులువైన మార్గాలు అనుసరిస్తే తప్పకుండా మీరు ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. దాని కోసం మార్గాలు ఇవే..

వ్యాయామం చేయడం:

వ్యాయామం చేస్తే ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు అనుకుంటే పొరపాటు. దీని వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీనితో మీరు ఎంతో ప్రశాంతంగా ఉండవచ్చు. ఎక్కువ వ్యాయామం చేసే వాళ్ళు తక్కువ ఒత్తిడికి గురి అవుతుంటారు. కాబట్టి మీరు ప్రతి రోజు వ్యాయామం చేయండి లేదా వాకింగ్, డాన్సింగ్, లేదా యోగా కూడా చేయవచ్చు.

సప్లిమెంట్స్ ని వాడటం :

కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఒత్తిడిని నుండి బయటపడవచ్చు. లెమన్ బామ్, ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్, అశ్వగంధ, గ్రీన్ టీ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మీరు ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.

కొవ్వొత్తిని వెలిగించండి :

ఇళ్లల్లో సెంటెడ్ క్యాండిల్స్ ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా లావెండర్, గులాబీ, ఆరెంజ్, శాండిల్ ఇలాంటివి ఉపయోగించడం వల్ల అరోమా థెరపీ జరిగి ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మీరు ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు.

కెఫిన్ ని తగ్గించడం :

చాలా మంది రోజులో ఎక్కువ సార్లు టీ కాఫీలు తాగుతూ ఉంటారు. ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. కాబట్టి వీటిని తగ్గించడం మంచిది.

స్నేహితులతో, కుటుంబంతో సమయాన్ని వెచ్చించడం :

స్నేహితులతో, కుటుంబంతో సమయాన్ని గడపాలి. వాళ్ళు పక్కన ఉంటె ఒత్తిడి నుండి ఎంతో సులువుగా బయటపడవచ్చు. అందరూ ఉండడం వల్ల కష్ట సమయాల్లో రిస్కు తక్కువగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news