పూర్తి ఆరోగ్యానికి సరైన నిద్ర ఎంతో అవసరం. చాలా శాతం మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ప్రశాంతమైన గాఢ నిద్రను పొందాలంటే కొన్ని రకాల చిట్కాలను తప్పకుండా పాటించాలి. ఎప్పుడైతే సరైన నిద్రను పొందుతారో, పూర్తి ఆరోగ్యం బాగుంటుంది. మంచి నిద్రను పొందాలంటే చుట్టుపక్కల వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి శబ్దాలు లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. మంచి నిద్రను పొందడం వలన శరీరంలో జరిగే ప్రక్రియలు సక్రమంగా జరుగుతాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల కారణంగా నిద్రలేమి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
చాలా మంది నిద్ర కోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ప్రశాంతమైన వాతావరణంలో కూడా నిద్రను పొందలేకపోతున్నారు. అటువంటి సందర్భాల్లో కొన్ని జాగ్రత్తలను పాటించడం అవసరం. రాత్రి సమయంలో తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అధికంగా భోజనం చేయడం వలన జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. నిద్రపోయే ముందు టీవీ, ఫోన్ మరియు ల్యాప్టాప్ వంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడైతే ఫోన్ ను ఎక్కువ సమయం ఉపయోగిస్తారో, నిద్ర పై ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు.
నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే, నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలను తాగడం ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. రాత్రి సమయంలో లేదా నిద్రపోయే ముందు టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ వంటి పదార్థాలను తీసుకోవడం వలన నిద్ర పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువలన వీటిని తీసుకోకుండా ఉండడం మంచిది. వీటన్నిటితో పాటుగా ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన నిద్రలో మార్పును గమనించవచ్చు. ఇటువంటి చిట్కాలను పాటించడం వలన మంచి నిద్రను పొందవచ్చు, ఆరోగ్యంగా జీవించవచ్చు.