బరువు పెరగాలి అనుకుంటున్నారా..? వీటిని తప్పక తీసుకోండి..!

-

చాలామంది ఉండవలసిన దాని కంటే తక్కువ బరువుతో ఉంటారు. బరువు పెరగాలని దాని కోసం ఎంతగానో ట్రై చేస్తూ ఉంటారు. మీరు కూడా బాగా బరువు పెరగాలని అనుకుంటున్నారా..? అయితే వీటిని డైట్ లో తప్పకుండా చేర్చుకోండి వీటిని కనుక మీరు డైట్ లో తీసుకున్నారంటే కచ్చితంగా బరువు పెరగడానికి అవుతుంది. మరి బరువు పెరగాలంటే ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం..

రోజు పాలని తీసుకోండి. పాలు తీసుకోవడం వలన ప్రోటీన్ అందుతుంది అలానే ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు మీకు అందుతాయి. పాల ని రోజూ తీసుకుంటూ ఉంటే కచ్చితంగా బరువు పెరగడానికి అవుతుంది. అన్నంతో కూడా బరువు పెరగొచ్చు చాలామంది భారతీయులు ప్రతి రోజు అన్నం తింటూ ఉంటారు. కార్బోహైడ్రేట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి బరువు పెరగడానికి సహాయ పడతాయి. గింజలని కూడా డైట్ లో ఎక్కువ తీసుకోండి బాదం వాల్నట్స్ జీడిపప్పు వంటివి మీరు ఎక్కువగా డైట్లో చేర్చుకుంటూ ఉంటే ప్రోటీన్స్ ఫ్యాట్స్ అంది బరువు పెరగడానికి అవుతుంది.

పన్నీర్ తో కూడా బరువు పెరగొచ్చు సులభంగా పన్నీర్ ద్వారా బరువుని పెంచుకోవచ్చు. నెయ్యి ద్వారా కూడా బరువు పెరగడానికి అవుతుంది. ప్రతిరోజు మీరు తినే ఆహార పదార్థాలలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తీసుకోండి అప్పుడు కచ్చితంగా బరువు పెరుగుతారు. బంగాళదుంపలతో కూడా బరువు పెరగడానికి అవుతుంది. బంగాళదుంపలతో మనం రకరకాల రెసిపీస్ ని తయారు చేసుకుని తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ తో కూడా బరువు పెరగడానికి అవుతుంది. ఖర్జూరం వంటి వాటిని కచ్చితంగా డైట్లో తీసుకోండి. గుడ్లు అవకాడో కూడా బరువు పెరగడానికి సహాయ పడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news