సినిమా ఛాన్స్ కోసం వెళితే బట్టలు విప్పించారు..!!

-

సినిమా రంగంలో అవకాశం కోసం వెళ్లే వారికి అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. చాలా మందికి రాగానే రెడ్ కార్పెట్ స్వాగతం వుండదు. బ్యాక్ గ్రౌండ్ వున్న వారికి మాత్రమే గౌరవం లభిస్తుంది.  అవకాశం కోసం వచ్చే వారిని మోసం చేసే బ్యాచ్ కూడా కాచుకొని వుంటారు. ఇలా మోసపోయే వారిలో  ఎక్కువ మంది అమ్మాయిలే వుంటారు. వారి ఆశను అడ్డు పెట్టుకుని వారిపై లైంగిదాడికి పాల్పడతారు. కాని రీసెంట్ గా జరిగిన సంఘటన లో విచిత్రంగా మోసపోయింది, ఒక మగవాడు.ఈ మోసానికి పాల్పడింది ఒక మహిళ. ఈ విచిత్ర కథ గురించి తెలుసుకుందాం.

 

ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఒక నటుడు చిన్న చితకా వేషాలు వేసుకుంటూ వుండేవాడు.ఇతనికి ఒక దర్శకురాలు మంచి సినిమా లో హీరో వేషం వుందని ఆశ పెట్టిందట. దీనితో మనోడు ముందు వెనకా చూసుకోకుండా దూసుకొని పోయాడట. షూటింగ్ మొదటి రోజు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమని కోరారట. అసలే హీరో మైకంలో వున్న సదరు నటుడు ఏమి చదవకుండానే సంతకం పెట్టాడట. దానితో షూటింగ్ కోసం తనని గదిలోకి వెళ్ళమని చెప్పారట. తీరా ఆ గదిలోకి వెళితే అక్కడ ఒక అమ్మాయి అర్థ నగ్నంగా వుందట. ఇదేంటి అని అడిగితే ఇది సెక్స్ మూవీ అని చావు కబురు చల్లగా చెప్పారట. దీనితో భయపడ్డ నటుడు నేను నటించనని చెప్పాడట. కాని వారు మాత్రం  అగ్రిమెంట్ మీద సంతకం చేసావు. నటించక లోతే 5 లక్షల రూపాయలు కట్టాలని, లేకుంటే చంపుతామని బెదిరించారట.

ఇక తప్పని సరి పరిస్థితుల్లో  వారి ఒత్తిడికి లొంగిపోయి ఆ సినిమా లో నటించడాట ఆ నటుడు. ఇక ఎలాగోలా అక్కడి నుండి బయట పడ్డాడట. ఇప్పుడు ఆ సినిమా విడుదల అయితే తన పరువు పోతుందని స్నేహితుల సాయంతో కంప్లయింట్ ఇచ్చి ఆ సినిమా దర్శకురాలి పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేపించాడట. అయితే ఈ సినిమా కు ఓటిటి డీల్ కూడా ఫిక్స్ అయ్యిందట. దీనితో సదరు నటుడు గుండె దడదడ మని కొట్టుకొంటుందట. ఎలా అయినా ఈ సినిమా ఆపాలని తెగ తాపత్రయ పడుతున్నాడట. కాబట్టి అవకాశం కొసం చూసే మగాళ్లు బీకేర్ఫుల్ .

 

Read more RELATED
Recommended to you

Exit mobile version