కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావు పాటిల్ నీలంగేకర్(91) మరణించారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. అయినప్పటికీ ఆయనకు కిడ్నీ సమస్యలు రావడంతో కుటుంబ సభ్యులు మళ్లీ ఆయన్ను హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ క్రమంలో ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
గత నెల 16న కరోనాతో శివాజీరావు పాటిల్ పుణెలోని ఓ ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజులకు ఆయన కరోనా నుంచి కోలుకుని ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. అయితే ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను మళ్లీ హాస్పిటల్‌లో చేర్చారు. ఈ క్రమంలో ఆయన కిడ్నీలు ఫెయిలై మృతి చెందారు. పాటిల్ ఈ రోజు ఉదయం మరణించారని హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి. ఇకపోతే 1985 జూన్ నుంచి 1986 మార్చి వరకు శివాజీరావ్ పాటిల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలియజేశారు.