నేడే హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసింగ్

-

నేడు హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసింగ్ జరగబోతోంది. హుస్సేన్‌సాగర్ తీరాన ఎలక్ట్రిక్ కార్లు రయ్ రయ్‌మని దూసుకెళ్లబోతున్నాయి. ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యమిస్తోంది. శనివారం హుస్సేన్‌సాగర్‌ తీరంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌ ఈ-కార్ల రేసుతో సందడిగా మారనుంది. భారత్‌లో జరగనున్న తొలి ఫార్ములా-ఈ రేసు ఇదే కావడం విశేషం.

హుస్సేన్‌సాగర్‌ తీరాన జరిగే అంతర్జాతీయ పోటీల కోసం 2.8 కిలోమీటర్ల స్ట్రీట్‌ సర్క్యూట్‌ను తీర్చిదిద్దారు. లుంబినిపార్కు నుంచి ప్రారంభమై సచివాలయం పక్క నుంచి మింట్‌ కాంపౌండ్‌, ఐమాక్స్‌ మీదుగా ఎన్టీఆర్ గార్డెన్‌ వరకు రేస్‌ సాగనుంది. మొత్తం 11 ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్లు పాల్గొనేపోటీలో. 22మంది రేసర్లు సత్తాచాటనున్నారు. రక్షణ చర్యల్లో భాగంగా స్ట్రీట్ సర్క్యూట్‌కి ఇరువైపులా పెద్ద ఎత్తున బారికేడ్లు, ప్రేక్షకుల గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

ఇప్పటికే శుక్రవారం సాయంత్రం తొలి ప్రాక్టీస్ రేస్ జరిగింది. ఇవాళ ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు రెండో ప్రీ ప్రాక్టీస్‌ రేస్‌, ఉదయం 10 గంటల 40 నిమిషాలకు అర్హత పోటీలు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేస్‌ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news