గుడ్ న్యూస్…ఇక నుంచి రేషన్ దుకాణాల్లో పోష్టికాహార బియ్యం..!

-

కేంద్రం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకం నుంచి రేషన్ దుకాణాల వరకు ఇక నుంచి అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి పోష్టికాహార బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దీనికి ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్రం అంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఎఫ్‌సీఐ, రాష్ట్ర ఏజెన్సీలు 88.65 లక్షల మిలియన్ టన్నుల పోషకాహార బియ్యాన్ని సేకరించాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. అయితే మూడు దశలలో పౌర సరఫరా వ్యవస్థ ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ఈ పోష్టికాహార బియ్యాన్ని ఇస్తామని తెలిపింది. దీని కోసం కేంద్ర ప్రభుత్వానికి రూ.4,270 కోట్ల ఖర్చు అవుతుందని అన్నారు.

మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహార లోప సమస్యలను లేకుండా చెయ్యాలని పోష్టికాహార బియ్యాన్ని అందించాలని కేంద్రం అంది. అలానే ఇతర ప్రభుత్వం పథకాల ద్వారా కూడా పోష్టికాహార బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేయాలనుకుంటోందని మోదీ చెప్పారు. అదే విదంగా మహిళలలో, చిన్న పిల్లలో పోషకాహార లోపాలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. 2024 నాటికి పేద వారికి ప్రభుత్వ స్కీమ్‌ల ద్వారా ఈ బియ్యాన్ని ఇస్తామని అన్నారు.

దీని మూలంగా ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్కూల్ పిల్లలకు, మహిళలకు పోర్డిఫైడ్ బియ్యాన్ని పైలట్ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదు రాష్ట్రాలలో 15 జిల్లాల్లో ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైన రాష్ట్రాలలో ఏపీ, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్‌ఘడ్‌లున్నాయి.

చాలా మంది మహిళలు, పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2019-21లో 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య కలిగిన సుమారు 57 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. 6 నుంచి 59 నెలల మధ్యలో వయస్సున పిల్లలు 67.1 శాతం మంది రక్తహీనతకు గురైనట్టు సర్వే ద్వారా తెలుస్తోంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news