చాలా మంది పిల్లలు ఆర్ధిక సమస్యల వలన చదువుకోలేకపోతున్నారు. మెరిట్ ఉండి కూడా డబ్బుల వలన చదువుకోలేకపోవడం అనేది ఘోరం. అందులోను చాలా ఊర్లలో ఆడపిల్లలని చదివించరు. కానీ కేంద్రం తీసుకు వచ్చిన ఈ స్కీమ్ తో బాలికలు కూడా చదువుకోవచ్చు. డబ్బులు కట్టక్కర్లేకుండా ఫ్రీగా బాలికలు చదువుకోవచ్చు. వారి విద్యకు అయ్యే ఖర్చును అంతా కూడా ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
కుమార్తెల ఉజ్వల భవిష్యత్తు కోసం…
1997 అక్టోబర్ 2న బాలికా సమృద్ధి యోజన స్కీమ్ ని కేంద్రం తీసుకు రావడం జరిగింది. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న బాలికలు దీనికి అర్హులు. కుమార్తెల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ స్కీమ్ ని తీసుకు రావడం జరిగింది.
ఎవరు బాలికా సమృద్ధి యోజన స్కీమ్ కి అర్హులు..?
15 ఆగస్టు 1997 తర్వాత పుట్టిన ఆడపిల్లలకు మాత్రమే బాలికా సమృద్ధి యోజన స్కీమ్ కి అర్హులు.
దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న బాలికలు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందొచ్చు.
కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు వున్నా సరే ఇద్దరూ అర్హులే.
పైగా ఆడపిల్లకు జన్మనిచ్చిన సమయంలో తల్లికి రూ.500 కూడా ఇస్తారు.
చదువు కోసం ఏటా స్కాలర్‌షిప్ ని ఇస్తారు. బాలికకు 18 ఏళ్లు నిండే వరకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.
ఒకవేళ మేజర్ కాక ముందే పెళ్లి చేసేస్తే వాళ్ళు అనర్హులు అవుతారు.
ఈ స్కాలర్‌షిప్ ఎలా వస్తుంది..?
ఆడపిల్లలకి 1-3వ తరగతి వరకు ప్రతీ ఏడాది రూ.300 వస్తాయి.
4వ తరగతిలో రూ.500 వస్తాయి.
ఐదో తరగతిలో రూ.600. 6-7 తరగతులకు రూ.700. ఎనిమిదవ తరగతిలో రూ.800. 9-10 తరగతిలో రూ.1000 స్కాలర్‌షిప్ ఇస్తారు. 10వ తరగతి తర్వాత ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులను కూడా ఇస్తారు.
ఎలా స్కీమ్ బెనిఫిట్స్ ని పొందాలి..?
అంగన్‌వాడీ కేంద్రంలో కుటుంబానికి సంబంధించిన దరఖాస్తు పూర్తి చెయ్యాల్సి ఉండి.
కావాల్సిన డాక్యుమెంట్స్:
ఆడపిల్ల జనన ధృవీకరణ పత్రం
తల్లి లేదా కుమార్తె బ్యాంక్ ఖాతా
అడ్రస్ ప్రూఫ్ అవసరం అవుతాయి.
18 సంవత్సరాలు నిండిన తర్వాత గ్రామపంచాయతీ/మున్సిపాలిటీ నుండి ఆమెకి వివాహం కాలేదని సర్టిఫికేట్ ఇవ్వాలి.