జగన్ సర్కార్ మరో సంచలన నిర్నయం తీసుకుంది. నవ రత్నాలు పేదలందరికీ.. ఇళ్లు కార్యక్రమంలో నిర్మాణమౌవుతున్న ఈ కాలనీలకు డిస్కమ్ ల ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. మొదటి దశలో 12,49,133 సర్వీసులకు విద్యుత్ ఇస్తున్నారు. దీనికి అవసరమైన నిధులను గృహ నిర్మాణ శాఖకు సమకూర్చేందుకు ప్రభుత్వమే హామీ ఇస్తోంది.
అలాగే రూ.4600 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఒకే చెప్పింది. నవరత్నాలు పేదలందరికీ.. ఇళ్లు పథకం కింద ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 3951 లే అవుట్లు ఉండగా.. 328383 ఇళ్లకు విద్యుత్ సర్వీసులు ఇస్తున్నారు.
ప్రభుత్వం దీని కోసం రూ.1217.17 కోట్లు ఖర్చు చేస్తోంది. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 2813 లే అవుట్లు ఉంటే.. 516188 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లను రూ.2519 కోట్లతో అందిస్తున్నారు. ఏపీసీపీడీసీఎల్ లోని మూడు జిల్లాలతో పాటు సీఆర్‌డీఏ పరిధిలో 6 లక్షల ఇళ్లకు విద్యుత్ సర్వీసులను రూ.1805 కోట్లతో ఇవ్వనున్నారు.