తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రైతు బంధు ను డిసెంబర్ 28 వ తేదీ నుండి అర్హులైన రైతు లబ్ది దారుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు సీఎం కేసిఆర్ తెలిపారు. ప్రారంభించిన వారం పది రోజుల్లో గతం లో మాదిరి వరుస క్రమంలో అందరి ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో రైతు బంధు జమ అవుతుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.
రైతు బంధు అమలు పై ఎవరూ కూడా ఆందోళన చెందనక్కర్లేదని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ఏడాది యాసంగిలో వరి కొనుగోలు చేసేది లేదని.. సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొనుగోళ్లపై కేంద్రం తీరును రైతులకు వివరించాలని కలెక్టర్లకు సూచనలు చేశారు. తెలంగాణ వ్యవసాయ విధానాలు దేశంలోనే ఎక్కడా లేవని… రాబోయే వానాకాలం పంట పై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వాన కాలంలో పత్తి, వరి మరియు కొన్నిసార్లు పై దృష్టి సారించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్.