జల వివాదం : తెలంగాణకు కేంద్రం షాక్ !

జల వివాదం నేపథ్యంలో తెలంగాణకు జల్‌శక్తి శాఖ మంత్రి ‌షెకావత్‌ షాక్ ఇచ్చారు. లోక్ సభలో కడప ఎంపి వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి అడిగిన ప్రశ్నపై జల్‌శక్తి శాఖ మంత్రి ‌షెకావత్‌ మాట్లాడుతూ.. ప్రశ్నోత్తరాల సమయంలో వైసిపికు చెందిన కడప ఎంపి వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి.. గెజిట్‌ నోటిఫికేషన్‌, తెలంగాణ విద్యుదుత్పత్తి అంశాలను లేవనెత్తారని చెప్పిన ఆయన.. తెలంగాణ జల విద్యుదుత్పత్తిని అడ్డుకోవాలని ఇప్పటికే కేంద్రానికి ఏపి సిఎం జగన్‌ లేఖ రాశారని పేర్కొన్నారు.

Gajendra-Singh

అయినా, నేటికీ తెలంగాణ విద్యుదుత్పత్తి ఆపలేదని.. దీనివల్ల రాయలసీమ జిల్లాలు తీవ్రంగా నష్టపోతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ విద్యుదుత్పత్తిని కేంద్రం, కృష్ణా బోర్డు (కెఆర్‌ఎంబి) అడ్డుకోవాలని.. లేకపోతే, ఏపితో పాటు చెన్నైలో నీటికొరత ఏర్పడే ప్రమాదముందన్నారు. కృష్ణా నదిపై తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కేంద్రం అడ్డుకోవాలని వైఎస్ అవినాశ్ రెడ్డి కోరారు.

దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమాధానమిచ్చారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేందుకే గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు చెప్పారని.. జలవివాదంపై కేంద్రం, కెఆర్‌ఎంబికి ఏపి నుంచి లేఖలు వచ్చాయన్నారన్నారు. దీన్ని పరిశీలించామనీ.. తాము సూచించినా జల విద్యుదుత్పత్తిని తెలంగాణ ఆపలేదని చెప్పారు. విద్యుదుత్పత్తిని ఆపాలని మరోసారి తెలంగాణ రాష్ట్రానికి చెబుతామన్నారు కేంద్ర మంత్రి.