ట్రెండ్ ఇన్: ‘సర్కారు వారి పాట’ డిజాస్టర్..నెగెటివ్ కామెంట్స్‌కు కౌంటర్ ఇస్తున్న ఫ్యాన్స్

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. గురువారం ఈ సినిమా విడుదలైంది. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’,‘సరిలేరు నీకెవ్వరు’ వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత మహేశ్ నటించిన సినిమా ఇది. కాగా, దీనికి ‘‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించారు.

భారీ అంచనాల నడుమ ఈ చిత్రం గురువారం విడుదలైంది. అంచనాలను మించి సినిమా ఉంటుందని మేకర్స్ గతంలో ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎక్స్ పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి.కాగా, ఈ ఫిల్మ్ ‘పోకిరి’ వైబ్స్ కలిగి ఉందని స్వయంగా సూపర్ స్టార్ మహేశ్ చెప్పుకొచ్చారు. దాంతో మహేశ్ – కృష్ణ అభిమానులు ఈ పిక్చర్ డెఫినెట్ గా రికార్డులను తిరగరాస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

అలా భారీ అంచనాల నడుమ బాక్సాఫీసు నుంచి డబ్బుల రికవరీకి ఫైనాన్స్ ఏజెంట్ గా ‘సర్కారు వారి పాట’ చిత్రంలో బయలు దేరాడు మహేశ్. కాగా, మార్నింగ్ ఫస్ట్ షో మొదలైన నాటి నుంచి సినిమా అంచనాలను అందుకోలేకపోయిందని కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మై క్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ఈ మేరకు వారు #DisasterSVP హ్యాష్ ట్యాగ్ డిజాస్టర్ ఎస్ వీ పీ ని ట్రెండ్ చేస్తున్నారు.

‘‘సినిమా అస్సాం’’ అంటూ పోస్టులు పెడుతూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపున సినీ ప్రముఖులు, మహేశ్ బాబు అభిమానులు సినిమా చాలా బాగుందని, మహేశ్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందని అంటున్నారు. వారు నెగెటివ్ కామెంట్స్ చేసే వారికి ధీటుగా సమాధానాలిస్తున్నారు కూడా.

SVP పై నెగెటివిటీ కావాలనే కొందరు స్ప్రెడ్ చేస్తున్నారని అంటున్నారు. తుపాను, భారీ వర్షాల వలన ఏపీలో కొన్ని చోట్ల బెన్ఫిట్ షోలు రద్దయ్యాయని, ఫస్ట్ డే కూడా కొంచెం డల్ గా ఉందని వివరిస్తున్నారు. రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో సినిమాకు డెఫినెట్ గా మంచి ఆదరణ లభిస్తుందని చెప్పుకొస్తు్న్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news