పోలింగ్ కేంద్రం మీద వైసీపీ దాడి.. బ్యాలెట్ పేపర్ల లూటీ !

Join Our Community
follow manalokam on social media

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు.. ఇప్పటికే కొన్ని చోట్ల కౌంటింగ్ ప్రక్రియ ముగిసి అభ్యర్థులను ప్రకటించగా ఇంకా కొన్ని చోట్ల ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం లో ఉన్న కందరాడ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఊర్లో టిడిపి బలపరిచిన అభ్యర్థి ముందంజలో ఉండడంతో వైసిపి మద్దతుదారులు రెచ్చిపోయారు..

కౌంటింగ్ కేంద్రం లోకి చొరబడి బ్యాలెట్ పేపర్లను లూటీ చేశారు. మొత్తంగా 43 బ్యాలెట్ పత్రాలు మిస్ అయినట్లు ఆర్డీవో గుర్తించారు.ఈ అంశం మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు బ్యాలెట్ పత్రాలు మిస్సింగ్ పై దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే ఈ సర్పంచ్ ఫలితంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తేల్చి చెప్పారు. ఇక వైసిపి మద్దతుదారులు ఇలా రెచ్చిపోవడంతో టిడిపి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. గొడవలు జరిగే అవకాశం ఉండటంతో ఇరువర్గాల వారు ఇద్దరిని పోలీసులు అక్కడి నుంచి చెదర కొట్టారు.

TOP STORIES

వనదేవతల జాతర.. మినీ మేడారం

సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్నారు. మండమేలిగే పండగ సందర్భంగా...