చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన గంగవ్వ

-

గంగవ్వ.. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్.. మై విలేజ్ షో ద్వారా తెలంగాణ యాసకు మళ్లీ జీవం పోస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచుతులయ్యారు. అంతేకాకుండా, బిగ్ బాస్ హౌస్‌కు వెళ్లి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆమె మాటలు.. పాటలకు జనం ఫిదా అవుతుంటారు. అలాంటి గంగవ్వ.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి క్షమాపణలు చెప్పారు.

Don't get it wrong sir.. Gangavva's apology to Chandrababu | Gangavva  apologizes to Chandrababu Naidu

ఉగాదిని పురస్కరించుకొని ఈ ఏడాది ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయగా అందులో పార్టిసిపేట్ చేసిన గంగవ్వకు సినీ, రాజకీయ నాయకుల జాతకాలు చెప్పాలంటూ స్క్రీన్ పై చంద్రబాబు లోకేష్ ఫోటోలు చూపించి యాంకర్ అడిగిన ప్రశ్నకు గంగవ్వ చంద్రబాబుకు గ్రహణం పట్టుకుంది అంటూ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు పై తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదని, సినీ, రాజకీయ నాయకుల గురించి అంతగా తనకు అవగాహన లేదని, ఆ చానల్ వాళ్లు చెప్పింది నేను చేశానని అంతకుమించి నాకు ఏం తెలియదని చంద్రబాబుకు క్షమాపణలు చెబుతూ ఆ వీడియోలో గంగవ్వ కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే టీడీపీ నాయకులు వైరల్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news