బాలకృష్ణను అభినందించిన చంద్రబాబు.. ఎందుకంటే..!

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నందమూరి బాలయ్య బాబుని ట్విట్టర్ వేదికగా అభినందించారు.విషయంలోకి వెళ్తే అవుట్ లుక్ మ్యాగజైన్ ఇండియాలో బెస్ట్ క్యాన్సర్ హాస్పటల్ విభాగంలో బసవతారకం హాస్పిటల్ రెండో స్థానంలో నిలిచింది.ఎంత చంద్రబాబు అభినందించారు.“నందమూరి బాలయ్య బాబుకి మరియు బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

Unstoppable 2 First Episode: Emotional and Entertaining

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇండియాలో రెండవ బెస్ట్ ఆంకాలజీ హాస్పిటల్ గా అవుట్ లుక్ మ్యాగజైన్ లో నిలిచినందుకు తక్కువ ఖర్చుతో కూడుకున్న కారుణ్య సంరక్షణ మరియు పేదలకు సరికొత్త క్యాన్సర్ చికిత్సలు అందించే ప్రపంచ స్థాయి సమగ్ర క్యాన్సర్ కేర్ సెంటర్ నిర్మించడంలో బృందం చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను” అంటూ చంద్రబాబు ట్విట్టర్ లో ప్రశంసించారు. వృత్తిపరమైన నిబద్ధతతో, రోగుల పట్ల దయతో వ్యవహరిస్తూ, వారి పట్ల అత్యంత శ్రద్ధ తీసుకుంటూ, అత్యాధునిక క్యాన్సర్ చికిత్స విధానాలు, చికిత్స వ్యవస్థలను పేదలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారని వివరించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news