కేసీఆర్‌ లేని తెలంగాణను ఊహించుకొలేం : మంత్రి గంగుల

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారంలో స్పీడ్‌ పెంచింది. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు కరీంగర్‌లో కరీంనగర్ పట్టణంలోని స్థానిక పద్మనాయక కళ్యాణ మంటపంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Gangula Kamalakar : రాష్ట్రంలో విభజన శక్తులు పన్నుతున్న కుట్రలను  తిప్పికొట్టాలి - NTV Telugu

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్‌ నియోజకవర్గ చరిత్రలో ఒకసారి గెలిచిన వ్యక్తి మరోసారి గెలవలేదని, నన్ను నమ్మి మూడు సార్లు గెలిపించారని, ఈ పదవి నాదే అయినా మీరు పెట్టిన భిక్షేనని..మరోసారి ఆశీర్వదిస్తే మరింత గొప్పగా పనిచేస్తానని గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ సంక్షేమ ఫలాలు భవిష్యత్ తరాలకు అందాలంటే మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులను బలోపేతం చేయాలన్నారు మంత్రి గంగుల. కేసీఆర్‌ లేని తెలంగాణను ఊహించుకొలేమన్నారు. మనం తప్పు చేస్తే భవిష్యత్ తరాలు అంధకారం అవుతాయని తెలిపారు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టి మన సంపద దోచుకెళ్లాలని చూస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి గంగుల సూచించారు.

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 90 కు పైగా సీట్లు సాధించి అధికారంలోకి రానున్నమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం హామీలకే పరిమితం అని..కర్ణాటక లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటి మూటలు అయ్యాయని విమర్శించారు. 45 రోజులు నా కోసం పనిచేస్తే 5 ఏళ్లు మీకోసం పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నానని తెలిపారు. పదవులు ఎన్ని వచ్చినా తను మారే వ్యక్తిని కాదని, పార్టీ కార్యకర్తలే మా బలం..మా ధైర్యం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news