సభలకు హాజరు అవుతున్న ప్రజలను చూస్తుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని స్పష్టం అవుతుందన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఇవాళ ఆయన మహేశ్వరంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ పరాక్రమ భూమి అని, తెలంగాణ ఏర్పాటు లో బీజేపీ ది ప్రముఖ పాత్ర అన్నారు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం అభివృద్ది వేగంగా జరుగుతుందని బీజేపీ భావించిందని, తెలంగాణ ను కేసీఆర్, బీఆర్‌ఎస్ తీసుకు రాలేదన్నారు.
అంతేకాకుండా.. ‘తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ తెలంగాణ యువత ది, తెలంగాణ ప్రజలది. బీజేపీ కి తెలంగాణ కు ఓల్డ్ సంబంధం ఉంది… బీజేపీ గెలిచిన సీట్లలో తెలంగాణ నుండి ఒకటి. ఇక్కడ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం తో ఈ రోజు బీజేపీ 302 సీట్లు కు చేరుకుంది. అభివృద్ది విషయం లో గుజరాత్ ను చూడండి… అక్కడ 27 సంవత్సరాలుగా బీజేపీ అధికారం లో కొనసాగుతుంది. 10 ఏళ్లుగా కెసిఆర్ అధికారం లో ఉన్నారు… హైదారాబాద్ మినహా తెలంగాణ అభివృద్ది చెందలేదు.. ఇంకా వెనుక బడిన రాష్ట్రంగా నే ఉంచారు. కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వం నీ ఏర్పాటు చేస్తామని అంటుంది …తెలంగాణ కి కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది… ప్రజలను మోసం చేసింది.
సుష్మ రాజ్ ఒత్తిడితో నే కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు కోసం దిగి వచ్చింది. చాలా సమస్యలను పరిష్కరించకుండా తెలంగాణ ను కాంగ్రెస్ దగా చేసింది. తెలంగాణ లో అభివృద్ది నీ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చారు… ప్రభుత్వ పాలన లో కుటుంబ జోక్యం ఉంది… ఇక్కడ జరుగుతున్న అవినీతి ఢిల్లీ వరకు వచ్చింది. తెలంగాణ ప్రజలు ముఖ్యమనే ప్రభుత్వం కావాలి కానీ కుటుంబము ఫస్ట్ అనే ప్రభుత్వం కాదు. కుటుంబాలకు వ్యతిరేకం కాదు… కానీ మొత్తం కుటుంబం రాజకీయం చేయడం ప్రభుత్వం లో ఉండడానికి వ్యతిరేకం.’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.