గ్యాస్ వినియోగదారులకు ఊరట… తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

గ్యాస్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి చమురు సంస్థలు. ఇప్పటికే పెట్రోల్, గ్యాస్ ధరలతో అల్లాడుతున్న ప్రజానీకానికి గుడ్ న్యూస్ చెప్పాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తూ.. నేషనల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈరోజు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంతో 19 కిలోల కమిర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను రూ.91.50 తగ్గించాయి. ఈ నిర్ణయం వల్ల గ్యాస్ వినియోగించే వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించినట్లు అయింది. తగ్గిన ధరలు నేటి నుంచి అంటే ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. నేటి నుండి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1907 గా ఉంది.

gas

ప్రస్తుతం చమురు సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు కాస్త ఊరట కలుగనుంది. ఇటీవల కాలంలో వరసగా పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు.. గ్యాస్ ధర తగ్గింపు ఉపశమనం కలుగనుంది. ఇప్పటికే పెట్రోల్ ధరలను తగ్గించినా.. లీటర్ కు రూ. 100కు పైగా ధరలు ఉంటున్నాయి.