తులసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేద మందులలో కూడా తులసిని ఎక్కువగా వాడతారు. తులసి లో విటమిన్ ఏ, ఐరన్, సాల్యుబుల్ ఫైబర్, ఇన్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటాయి. అయితే ఉదయాన్నే తులసి నీళ్ళు తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మరి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీళ్లు తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చు అన్నది చూద్దాం.
అజీర్తి సమస్యలు ఉండవు:
ఉదయాన్నే తులసి నీళ్లు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. ఒంట్లో ఉండే చెడు పదార్థాలను తొలగిస్తుంది. అలానే జీర్ణం బాగా అయ్యేటట్టు చూసుకుంటుంది.
కార్డియోవాస్క్యులర్ హెల్త్ కి మంచిది:
ఉదయాన్నే ఖాళీ కడుపున తులసి నీళ్లు తీసుకోవడం వల్ల హై బీపీ, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఇంఫ్లమేషన్ తగ్గుతుంది:
తులసి నీళ్లు తీసుకోవడం వల్ల ఇంఫ్లమేషన్ సమస్య కూడా తగ్గుతుంది. మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలు ఉండవు. దీని వలన దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి కూడా బయటపడచ్చు.
లివర్ ఆరోగ్యం బాగుంటుంది:
తులసి నీళ్లు తాగడం వల్ల లివర్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలానే క్యాన్సర్ సమస్య కూడా తగ్గుతుంది.
బరువు తగ్గొచ్చు:
బరువుగా ఉండే వాళ్లు తులసి నీళ్లు ఉదయాన్నే తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి కూడా అవుతుంది. ఒబెసిటీ బాధపడే వాళ్లకు కూడా తులసి నీళ్లు బాగా సహాయం చేస్తాయి.
తులసి నీళ్లు ఎలా తయారు చేసుకోవాలి..?
రెండు కప్పుల నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా తులసి ఆకులు వేసి మూడు నిమిషాల పాటు మరిగించి.. ఆ తర్వాత వడగట్టుకుని ఆ నీటిలో కొద్దిగా తేనె వేసుకొని గోరువెచ్చగా తీసుకుంటే మంచిది.