ఒకవైపు వేసవి ఎండలతో ఇబ్బందులు పడుతున్నారు.. నిత్యావసర ధరలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. వాటితో పాటు పెట్రోలు,డీజెల్ ధరలు కూడా సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి..ఇప్పుడు మరో భారం పడనుంది.వంట గ్యాస్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు ఈరోజు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.గృహ వినియోగ గ్యాస్ సిలీండర్ ధరను పెంచుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 ఉండగా, ఇప్పుడు 50 రూపాయలు పెరిగింది.
తాజాగా పెరిగిన ధరతో సిలిండర్ ధర రూ. 1052కు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి.ఇప్పటికే నిత్యావసర వస్తువుల పెరుగుదలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదవర్గాల ప్రజలకు కుటుంబ పోషణ భారంగా మారుతోంది.ఇప్పుడు పెరిగిన ధరల వల్ల ప్రజలకు మరో భారం పడనుంది. కొద్ది రోజుల క్రితం 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది.ఇప్పుడు మరోసారి పెరగడం షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
మే1 నుంచి హైదరాబాద్ లో వాణిజ్య సిలీండర్ ధర రూ. 2,460 నుంచి రూ. 2,563.50కి చేరింది..ప్రస్తుతం కూరగాయల ధరలు కూడా సామన్యులకు అందనంత పైకి చేరుకున్నాయి. ఇక చికెన్,మటన్ ధరలు కూడా రంజాన్ సందర్భంగా భారీగా పెరిగినట్లు తెలుస్తుంది..ప్రభుత్వం సామాన్యుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ధరలను అదుపులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. గ్యాస్ ధరలు జూన్ నెలకు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.