ఎవరైనా గుర్తింపు పొందాలంటే వాళ్ళ యొక్క లక్షణాలు బట్టి వాళ్ళు గుర్తింపు పొందుతారు. ఈ విషయాన్ని ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా చెప్పారు. సద్గుణాలు ఉన్న వ్యక్తి అందరి చేత ప్రేమించబడతారు. అలానే జీవితం లో విజయం సాధిస్తారు కూడా.
ఆచార్య చాణక్య మరి ఏ లక్షణాలు ఉంటే విజయం సాధించవచ్చు అని చెప్పారు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాణిక్య నీతి ప్రకారం ఈ లక్షణాలు ఉంటే మంచి పొజిషన్ కి వెళ్తారు. అలానే గౌరవంగా బతుకుతారు. మరి ఇక వాటి కోసం తెలుసుకుందాం.
మధురంగా మాట్లాడడం:
ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క మాట తీరును మార్చుకుంటూ ఉండాలి. మధురంగా మాట్లాడితే ఇతరుల్ని నొప్పించకుండా ఉండొచ్చు. అదే విధంగా ఇలా మాట్లాడితే ఆనందం కలుగుతుంది. కనుక మధురంగా మాట్లాడే తీరు అలవాటు చేసుకోవాలి.
మధురమైన మాటలు ఇతరుల్ని ఆకట్టుకుంటాయి కూడా. దానితో ఇతరుల సహకారం కూడా లభిస్తుంది. శత్రువులు కూడా మధురంగా మాట్లాడే వాళ్ళని ఇష్టపడతారు.
వినయంగా ఉండటం:
ప్రతి ఒక్కరూ వినయంగా ఉండాలి. నిజానికి విజయ రహస్యం లో వినయం దాగి ఉంది. ఇలా వినయంగా ఉంటే ఇతరులు ఇష్టపడతారు కాబట్టి తప్పకుండా ఈ గుణాలు ఉండాలి. దీనితో ఉత్తములుగా మారతారు అలానే సమస్యలేమీ లేకుండా ఆనందంగా కూడా ఉండగలరు.