గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోకుండా ఉండాలంటే.. వీటిని పక్కా ఫాలో అవ్వండి..!

-

గ్యాస్ సిలిండర్ ధరలు రోజు రోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. గ్యాస్ సిలిండర్ ని ఆదా చేసుకోవడం చాలా ముఖ్యం. మీ సిలిండర్ చాలా త్వరగా అయిపోతుందా..? అయితే మీరు మీ గ్యాస్ సిలిండర్ ని ఆదా చేసుకోవాలని చూస్తున్నారా..? అయితే కచ్చితంగా ఈ చిట్కాలని ట్రై చేయండి. అప్పుడు సిలిండర్ ని ఆదా చేసుకోవచ్చు. ఎల్పీజీ సిలిండర్ ఎక్కువ కాలం రావాలంటే ఖచ్చితంగా వీటిని అనుసరించండి. అప్పుడు గ్యాస్ చేసుకోవడానికి అవుతుంది. గ్యాస్ వినియోగించే వాళ్ళు ఒకే సారి వంట చేసుకోవడం మంచిది.

 

రోజుకి మూడు నాలుగు సార్లు వంట చేసుకుంటే ఎక్కువ గ్యాస్ అవుతుంది. కాబట్టి రోజుకి ఒకేసారి వంట చేసుకోవడం మంచిది. అలానే ప్రెషర్ కుక్కర్ ద్వారా ఫుడ్ ని ఫాస్ట్ గా కుక్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రెషర్ కుక్కర్ లని ఉపయోగించడం మంచిది. గ్యాస్ తక్కువ అవుతుంది కాబట్టి వీలైనంత వరకు కుక్కర్లో వంట చేసుకోండి. అలానే కరెక్ట్ బర్నర్ లో వంట చేయడం కూడా ముఖ్యం. రెండు బర్నర్లలో ఒకటి పెద్దవి ఇంకోటి చిన్నవి ఉంటాయి అందువలన బర్నర్ ని బట్టి మీరు పాత్రని ఉపయోగించండి. అప్పుడు గ్యాస్ ని ఆదా చేయడానికి అవుతుంది.

తరచు మీ బర్నర్ లని శుభ్రం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. బర్నర్లు వేగంగా హీట్ అవుతాయి తక్కువ గ్యాస్ ఖర్చు అవుతుంది కాబట్టి గ్యాస్ ఆదా చెయ్యొచ్చు. వంట చేసేవాళ్లు వంట అయిపోయిన వెంటనే గ్యాస్ ని కట్టేయడం మంచిది. వంట పూర్తిగా అవ్వడానికి కాస్త ముందే గ్యాస్ ని ఆఫ్ చేసుకుంటే కూడా గ్యాస్ సిలిండర్ అని ఆఫ్ చేయొచ్చు. వంట చేసేటప్పుడు స్టవ్ మీద పెట్టే పాత్ర మీద ప్లేట్ పెడితే త్వరగా ఉడుకుతాయి.

ఆవిరి లోపలే ఉంటుంది కాబట్టి స్పీడ్ గా అవుతుంది పైగా గ్యాస్ ని తక్కువ వినియోగించొచ్చు. లేకపోతే ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ గ్యాస్ అవుతుంది. గ్యాస్ లీకేజ్ వంటివి అవుతూ ఉంటాయి కాబట్టి చూసుకుంటూ ఉండండి. రెగ్యులేటర్ వంటివి తరచూ చెక్ చేస్తూ ఉండండి. ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలని మీరు ట్రై చేస్తే కచ్చితంగా చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news