సామాన్యులకు బిగ్ అలర్ట్. గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. ఇండియా వ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ పై… ఏకంగా 50 రూపాయలు పెన్షన్ ఉన్నట్లు కేంద్రం నిన్న ప్రకటించింది. ఈ కొత్త ధరలు ఇవాల్టి నుంచి అమలులోకి వస్తాయి. ఉజ్వల పథకం సిలిండర్ ధర 503 నుంచి 533 రూపాయలకు పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో.. ఇదే గ్యాస్ సిలిండర్ ధర 825 గా నిన్నటి వరకు ఉండేది. 50 రూపాయలు పెరగడంతో ఆ సిలిండర్ ధర 870 రూపాయలు గా మారింది. ఇక హైదరాబాదులో 855 రూపాయలుగా ఉన్న సిలిండర్ ధర 905 రూపాయలుగా మారింది. సిలిండర్ కోసం నిన్నటి వరకు ఆన్లైన్లో చెల్లింపులు చేసినా… డెలివరీ ఇవాళ వస్తే మిగతా 50 రూపాయలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.