సాంకేతికంగా బీజేపీ గెలిచినప్పటికీ.. నైతికంగా గెలుపు నాదే అని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తన గెలుపు కోసం కష్టపడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయి బీజేపీ గెలుపు సహకరించారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే బీజేపీకి సపోర్ట్ చేశారని వివరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన 60 వేల ఓట్లు ఏమయ్యాయని గెల్లు ప్రశ్నించారు. కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన బల్మూరి వెంకట్ ను బలిపశువును చేశారని అన్నారు.
రెండేళ్లు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని గెల్లు అన్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా అని… వారిపై ఈగ వాలనీయనని అన్నారు. తమ నాయకులు గ్రామాల్లో చేసిన హామీలను అమలు చేసేలా ప్రయత్నిస్తానిని తెలిపారు. 2023లో హుజూరాబాద్ ఎన్నికల్లో ఎగరేది గులాబీ జెండానే గెల్లు స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపొందిన ఈటెల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓడిపోయినందుకు కుంగిపోవడం లేదని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.