అదిరే స్కీమ్… ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు… పూర్తి వివరాలు ఇవే..!

-

రకరకాల స్కీములని కేంద్రం తీసుకు వస్తూనే వుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకాల వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. కేంద్రం అందిస్తున్న స్కీముల్లో ముద్రా యోజన కూడా ఒకటి. ఈ పథకం వచ్చి ఎనిమిది ఏళ్లు అయ్యింది. ఇప్పటికే చాలా మంది ఈ స్కీమ్ కింద రుణాలు పొందారు. ఈ స్కీమ్ ద్వారా 41 కోట్ల మంది లబ్ధి పొందారు. ఈజీగా లోన్ ని ఈ స్కీమ్ ద్వారా పొందొచ్చు. ఇక ఈ స్కీమ్ కింద లోన్ పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఈ స్కీమ్ పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర ఆర్థిక సంస్థలు ముద్రా లోన్స్ ని ఇస్తున్నాయి. 2015 ఏప్రిల్ 8న ముద్రా స్కీమ్‌ను కేంద్రం తీసుకొచ్చింది. ఏ తనఖా లేకుండా రూ. 10 లక్షల లోన్ పొందొచ్చు. ఈ స్కీమ్ కింద స్మాల్ అండ్ మైక్రో ఎంట్రప్రెన్యూర్లు ప్రయోజనం పొందొచ్చు. ఎక్కువ మంది మహిళలకు రుణాలు ఈ స్కీమ్ కింద పొందవచ్చు. లోన్ మంజూరు అయిన వారిలో చూస్తే దాదాపు 68 శాతం మహిళలు వున్నారు. 51 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరిలకు చెందిన వాళ్ళు వున్నారు. ఈ స్కీమ్ కింద రూ. 10 లక్షల వరకు లోన్ పొందొచ్చు. స్కీమ్ కింద మొత్తంగా మూడు కేటగిరిలు ఉంటాయి. శిశు, కిశోర్, తరుణ్. గరిష్టంగా రూ. 10 లక్షల వరకు శిశు కేటగిరి.రూ. 50 వేల వరకు రుణం వస్తుంది.

కిశోర్ కేటగిరి కింద రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు రుణం వస్తుంది. తరుణ్ కేటగిరి కింద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల దాకా వస్తాయి. తీసుకున్న రుణాన్ని రూ. 5 ఏళ్లలోపు ఇచ్చేయాలి. బిజినెస్ పర్పస్, కెపాసిటీ ఎక్స్‌పెన్షన్, మోడ్రనైజేషన్ వంటి వాటికి ఈ స్కీమ్ కింద లోన్ ని పొందవచ్చు. షాప్‌కీపర్లు, ఫ్రూట్ అండ్ వెజిటబుల్ వెండర్స్, పౌల్ట్రీ, డెయిరీ, స్మాల్ మ్యానుఫ్యాక్షరింగ్ ఎంటర్‌ప్రైజ్ వాళ్లకి లోన్ పొందొచ్చు. అన్ని బ్యాంకులు కూడా ఈ స్కీమ్ కింద రుణాలు అందిస్తాయి. కావాలంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news