రెబల్స్‌తో కారుకు సెగలు..జూపల్లి-పొంగులేటితో డ్యామేజ్.!

-

అధికార బీఆర్ఎస్‌లో రెబల్స్ ఎక్కువ తయారవుతున్నారు. కొందరు నేతలని కే‌సి‌ఆర్ పట్టించుకోకపోవడం, అలాగే సరైన పదవులు ఇవ్వకపోవడం, సీటు విషయం కూడా తేల్చకపోవడంతో కొందరు సీనియర్ నేతలు రెబల్స్ మాదిరిగా మారుతున్నారు. అయితే ఎవరో చిన్నాచితక నేతలు వ్యతిరేకమైతే బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టమేమీ లేదు..అలా కాకుండా ప్రజా బలం ఉన్నవారు మారితే నష్టం తప్పదని చెప్పవచ్చు.

ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అటు మహబూబ్‌నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు..ఈ ఇద్దరు బి‌ఆర్‌ఎస్ రెబల్స్ మాదిరిగా మారిపోయారు. ఏ పార్టీలో చేరడం లేదు గాని..బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టేలా ముందుకెళుతున్నారు. ఖమ్మంలో పొంగులేటికి బి‌ఆర్‌ఎస్ న్యాయం చేయని విషయం తెలిసిందే. 2014లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచిన ఈయన తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గాని, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గాని సీటు ఇవ్వలేదు..ఎమ్మెల్సీ, రాజ్యసభ గాని, నామినేటెడ్ పదవి గాని ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో సీటు గ్యారెంటీ లేదు. దీంతో అసంతృప్తితో పొంగులేటి బి‌ఆర్‌ఎస్ కు దూరమై..సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు. జిల్లాలో తన వర్గం నేతల్ని పెంచుకుంటున్నారు.

ఇటు గత ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి జూపల్లి ఓడిపోయారు. అయితే తనపై కాంగ్రెస్ నుంచి గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డిని బి‌ఆర్‌ఎస్ లోకి తీసుకున్నారు. దీంతో ఆయన పెత్తనం పెరిగింది. నెక్స్ట్ సీటు కూడా ఆయనకే అంటున్నారు. దీంతో జూపల్లి బి‌ఆర్‌ఎస్‌కు దూరం జరుగుతూ వచ్చారు. ఆయన కూడా తన వర్గాన్ని పెంచుతున్నారు.

ఇదే క్రమంలో తాజాగా పొంగులేటి, జూపల్లి కలిసి ఆత్మీయ సమావేశం పెట్టారు. ఇక వీరు బి‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పావులు కదిపేలా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు నేతలతో బి‌ఆర్‌ఎస్ పార్టీకి డ్యామేజ్ తప్పదనే చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news