పోస్టాఫీస్ ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. ఈ స్కీముల వలన చాలా మందికి ఉపయోగకరంగా ఉంటోంది. ఈ స్కీమ్స్ లో చేరితే ప్రతి నెలా రెగ్యులర్‌గా క్రమం తప్పకుండా డబ్బులు వస్తాయి. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. రిస్క్ లేకుండా రాబడి పొందాలని అనుకునే వాళ్లకి ఈ స్కీమ్ బాగుంటుంది. పోస్టాఫీస్‌లో పలు స్కీములు వున్నాయి. అందులో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి. ఇందులో చేరితే సూపర్ బెనెఫిస్ ని పొందొచ్చు. నెల నెలా అకౌంట్ లో డబ్బులు పడతాయి.
ఇన్వెస్ట్ చేసే మొత్తం బట్టీ రాబడి ఉంటుంది. ఈ స్కీమ్ లో గరిష్టంగా రూ. 9 లక్షల వరకు డబ్బులు ని మీరు పెట్టచ్చు. సింగిల్ అకౌంట్‌కు అయితే ఇది వర్తిస్తుంది. ఒకవేళ కనుక అది జాయింట్ అకౌంట్ అయితే గరిష్టంగా రూ. 15 లక్షల వరకు డబ్బులు డిపాజిట్ చెయ్యచ్చు. లిమిట్ ఇది వరకు తక్కువ ఉండేది. కేంద్రం ఏప్రిల్ 1 నుంచి డిపాజిట్ లిమిట్ రెట్టింపు చేసింది. ఏప్రిల్ 1న స్మాల్ సేవింగ్ స్కీమ్స్ పై వడ్డీ రేట్లను కేంద్రం పెంచింది.
ఇప్పుడు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ రేటు వస్తోంది. ఇది ఆకర్షణీయ వడ్డీ రేటు అని చెప్పుకోవచ్చు. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ఐదేళ్ల దాకా రెగ్యులర్‌గా ఇన్‌కమ్ పొందొచ్చు. మళ్లీ స్కీమ్ టెన్యూర్ పొడిగించుకునే ఛాన్స్ ఉంటుంది. ఇందులో భార్యా భర్తలు ఇద్దరూ చేరొచ్చు. గరిష్టంగా రూ. 15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం ఏటా రూ. 1.11 లక్షలు వస్తాయి. అంటే నెలకు దాదాపు రూ. 10 వేలు లభిస్థాయి. దగ్గర లో పోస్టాఫీస్ కు వెళ్లి సులభంగానే ఈ స్కీమ్ లో చేరొచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి డాక్యుమెంట్లు ఈ స్కీమ్ లో చేరడానికి అవసరం. టెన్యూర్ అయిపోయేంత వరకు డబ్బులు అందులో ఉంచడం మంచిది.