BAD NEWS: మహిళ ప్రాణం తీసిన స్నాప్ చాట్ పరిచయం !

-

నేటికాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఉన్నవాళ్లో ఎక్కడో ఉన్న వాళళ్తో పరిచయాలు పెంచుకుని ప్రేమలు దోమలు అంటూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఒక్కోసారి ఈ పరిచయాలు, ప్రేమలు ప్రాణాలమీదకు తెస్తుంటాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక దుర్ఘటన ఆన్ లైన్ పరిచయాలను వద్దని చెబుతుంది. నెల్లూరుకు చెంచిన ఒక వ్యక్తి అమలాపురంలో మహిళను కత్తితో దాడి చేసి చంపాడు. కొంతకాలం క్రితం స్నాప్ చాట్ లో పరిచయం అయిన అమలాపురం నాగదుర్గ మరియు నెల్లూరు కు చెందిన హరికృష్ణలు కొంతకాలం బాగానే ఉన్నారు.

కానీ ఈ పరిచయాన్ని హరికృష్ణ ప్రేమని అనుకుని ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. కానీ నాగదుర్గ మాత్రం ససేమిరా అంది. దీనితో ఆగ్రహించిన హరికృష్ణ కత్తి తీసుకుని ఆమె ఇంటికి వెళ్ళాడు. అయితే అక్కడ నాగదుర్గకు బదులుగా శ్రీదేవి అనే వేరే మహిళ ఉడడంతో నాగదుర్గ అనుకున్న హరికృష్ణ శ్రీదేవిని కత్తితో పొడిచి చంపేశాడు. కాబట్టి ఆన్లైన్ పరిచయాలకు దూరంగా ఉండండి చాల జాగ్రత్తగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news