LIC: రూ.45 పొదుపుతో రూ.27 లక్షల బెనిఫిట్‌..!

-

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆఫ్‌ కార్పొరేషన్‌ ఎన్నో రకాల పాలసీలని అందిస్తోంది. ఈ పాలసీల వలన ఎన్నో లాభాలని పొందొచ్చు. చాలా మంది భవిష్యత్తు అవసరాల కోసం స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. మీరు కూడా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆఫ్‌ కార్పొరేషన్‌ అందించే స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఈ పాలసీ చూడాల్సిందే.

LIC అందించే స్కీమ్స్ లో జీవన్ ఉమంగ్ పాలసీ ఒకటి. ఇందులో మీరు 45 పొదుపు చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో మీకు రూ. 27 లక్షలు పొందవచ్చు. పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే అద్భుతమైన రాబడిని పొందవచ్చు. బీమా కవరేజీని అందించే ఎండోమెంట్ పాలసీ ఇది. మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తరవాత ప్రతీ ఏడాది కూడా డబ్బులు వస్తాయి.

పాలసీదారుడు మరణిస్తే నామినీకి ఆ డబ్బులు వస్తాయి. 100 సంవత్సరాల వరకు కవరేజీని అందిస్తుంది. పన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. సింపుల్ రివర్షనరీ బోనస్‌తో పాటుగా ఫైనల్ అడిషన్ బోనస్ కూడా పొందొచ్చు. పాలసీని తీసుకున్న తర్వాత, మీకు 100 ఏళ్ల వయస్సు వస్తే సాధారణ రివర్షనరీ బోనస్, తుది అదనపు బోనస్‌తో పాటు హామీ కూడా వస్తుంది. ప్రీమియం చెల్లింపు గడువు ముగిసాక ఒక సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం సమ్ అష్యూర్డ్‌లో 8% వస్తుంది.

ఇక ఎంత వస్తుందనేది చూస్తే.. ఎల్‌ఐసీ జీవన్ ఉమంగ్ పాలసీలో రోజుకు రూ.45 డిపాజిట్ చేస్తే ప్రతి నెలా రూ.1350 ప్రీమియంగా డిపాజిట్ చెయ్యాల్సి వుంది. అంటే సంవత్సరానికి రూ.16200 అవుతుంది. 30 ఏళ్లపాటు తీసుకుంటే 30 ఏళ్లలో రూ. 4.86 లక్షలు డిపాజిట్ అవుతుంది. మెచ్యూరిటీ 31 సంవత్సరాలలో ఉంటుంది. అప్పటి నుండి 100 సంవత్సరాల వయస్సు వరకు సంవత్సరానికి 40 వేల రూపాయల వరకు రిటర్న్‌లను పొందొచ్చు. ఇలా ఈ పథకం నుండి 27 లక్షల రూపాయల కంటే ఎక్కువే వస్తాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news