మీ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చెయ్యాలి అని భావిస్తున్నారా…? మీ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందా…? కాని పిల్లలు ఘనంగా పెళ్లి చెయ్యాలి అని కోరుతున్నారా…? అయితే ఇప్పుడు పెళ్లి చేసేయండి. అవును ఇప్పుడు పెళ్లి చేస్తే ఎన్ని లాభాలో… వందల మందికి భోజనాలు పెట్టే అవకాశం లేదు, వీడియోలు, ఫోటోలు ఖర్చులు తగ్గుతాయి. జనాల కోసం బస్సులు పెట్టే అవకాశం లేదు.
వందల మందికి గిఫ్ట్ లు ఇచ్చే అవకాశం లేదు, లడ్డూలు బూంది గోల లేదు. ఇక పెళ్లి చేసుకునే సమయంలో ఉండే ఇతరత్రా ఖర్చులు… అంటే పంతులు గారు సహా కొందరిని తక్కువగా పిలిచి చాలా తక్కువగా పిలిచే అవకాశం ఉంటుంది. ఇక ప్రముఖులను పిలవడానికి ట్రాఫిక్ అనుమతులు అవసరం లేదు. పెళ్లి చేయడానికి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ అవసరం లేదు. భోజనాల్లో నాన్ వెజ్ గోల అసలే లేదు.
ఇక అప్పగింతల సమయంలో ఉండే కొన్ని కొన్ని ఖర్చులు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. పూల దండల ఖర్చు, లైటింగ్ లు, జనరేటర్ ఖర్చులు అసలే ఉండవు. సింపుల్ గా ఇంట్లో పెళ్లి చేసేయొచ్చు. ఇక పిల్లలు ఒత్తిడి చేస్తుంటే ఆగండి గాని మీ చేతిలో పెత్తన౦ పూర్తి స్థాయిలో ఉంటే మాత్రం ఇప్పుడే తంతు పూర్తిగా కానిచ్చేయండి. సింపుల్ గా చూసుకున్నా పేద కుటుంబానికి అయితే లక్ష రూపాయలు కలిసి వచ్చే అవకాశం ఉంది.