కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో కరోనా ను అరికట్టేందుకు మొత్తం దేశం అంతటా లాక్ డౌన్ ను విధించింది. ఈ వైరస్ తీవ్రత ను బట్టి జోన్ల వారీగా ప్రాంతాలను గుర్తించి పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ వ్యవస్థలు ఇలా అన్ని మూతపడ్డాయి. ప్రజలందరూ కూడా తమ తమ ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని ప్రభుత్వము ప్రజలకు పిలుపు ఇచ్చింది.
నిత్యావసరాలు కొనేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి బయటకు వచ్చి నిత్యావసరాలను కొనుక్కుని తిరిగి ఇళ్లకు చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాలు బయట పెట్టే పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. అయిన కూడా కొందరు ఆకతాయిలు సామాజిక బాధ్యత లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. ఇటువంటి వారికి బుద్ది చెప్పాలని ప్రభుత్వం కటిన నిర్ణయాలు తీసుకుంది.
కర్ఫ్యూ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఉద్యోగం ఊడుతుందని ఐజీ అమల్‌రాజ్ హెచ్చరించారు. మే 3వ తేది వరకు దేశం అంతటా లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. అకారణంగా బయట తిరిగే వారి వాహనాలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా వారిపై కేసులు నమోదుచేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లం ఘించే వారిపై కేసులు నమోదుచేస్తున్నామని,
కేసు విచారణ పూర్తయ్యే వరకు విధులకు హాజరయ్యే పరిస్థితి లేదని కేంద్ర మండల ఐజీ అమల్‌రాజ్ చెప్పారు. అంతే కాకుండా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు పాస్‌పోర్ట్ కూడా పొందలేరని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆయన ప్రజలకు సూచించారు.