వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కలిగే నొప్పులను దూరం చేసుకోవడానికి పనికొచ్చే పద్దతులు..

-

దాదాపు 2సంవత్సరాల నుండి ఇంటి నుండే ఆఫీసు పనులు చేస్తున్నారు. కరోనాని దూరం పెట్టడానికి ఇంతకంటే మంచి పని ఇంకోటి లేదు కాబట్టి అలా ఉండడమే బెటర్. కానీ, చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా వెన్నెముక సమస్యలతో సతమతం అవుతున్నారు. నడుము నొప్పి, మెడనొప్పి బాధిస్తున్నాయి. ఇంటి నుండి పనిచేసేటపుడు చాలా విషయాల్లో నిర్లక్ష్యం ఉంటుంది. అది కొన్ని కొన్ని సార్లు అనేక దుష్పరిణామాలకు దారి తీయవచ్చు.

మరి నడుము నొప్పి, మెడనొప్పిని దూరం చేసుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

విరామం తీసుకోండి.

గంట పనిచేసినట్లయితే కొంతసేపు విరామం తీసుకోండి. లేచి నడవండి. దీనివల్ల అలసట తగ్గి, డిస్క్ మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది.

ఒకే స్థితిలో పని చేయకండి

మీరు కూర్చున్న విధానం మార్చండి. ఒకే పొజిషన్ లో ఎక్కువ సేపు కూర్చోవద్దు. మోకాళ్ళూ, నడుము ముందుకు వంగినట్లుగా ఎక్కువ సేపు కూర్చుంటే వెన్నముక మీద ప్రభావం పడుతుంది.

సరిగ్గా కూర్చోండి

మీ పాదాలు నేలకి ఆనినట్లుగా, వెన్నెముక నిటారుగా ఉండేలా, మీ మోకాలి వెనక భాగం సీటుకు తగలకుండా ఉండాలి. లేదంటే నరాల మీద ఒత్తిడి ఏర్పడి మీకు ఇబ్బంది కలుగుతుంది.

కంప్యూటర్ తెర

మీ కళ్ళకు సమాంతరంగా కంప్యూటర్ తెర ఉండేలా చూసుకోవాలి. మీ కళ్ళ నుండి ఒక అడుగు దూరంలో కంప్యూటర్ తెర ఉండాలి. కంప్యూటర్ తెరకి మధ్యలో మీ ముఖం ఉండేలా చూసుకోవడం కూడా ప్రధానమైనది.

మీ చేతుల గురించి చూసుకోండి

అరచేతిలో మౌస్ ఉంటే వాటిన్ పై భాగాలు మృదువైన ఉపరితలం మీద ఉండాలి. దానివల్ల అరచేతుల్లో తిమ్మిర్లు ఏర్పడకుండా ఉంటుంది.

మీ పోస్టర్ ఎలా ఉందో చూసుకోండి.

మీ చెవులు, మెడ, నడుము ఒకే లైన్లో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల వెన్నెముకపై భారం పడకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news