మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌..”గని” మూవీ ట్రైలర్‌ రిలీజ్‌

-

మెగా హీరో వరుణ్‌ తేజ్‌.. వరుస హిట్ల తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే గద్దల కొండ గణేష్‌ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వరుణ్‌ తేజ్.. ప్రస్తుతం గని అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అల్లు అరవింద్ సమర్పణలో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ను వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ ను కాసేపటి క్రితమే వదిలింది చిత్ర బృందం.

ఈ ట్రైలర్‌ లో వరుణ్‌ తేజ్‌.. బాక్సర్‌ గా అందరినీ ఆకట్టుకున్నాడు. సిక్స్‌ ఫ్యాక్‌ తో దుమ్ములేపాడు. అలాగే.. వరుణ్‌ తేజ్‌ కు సునీల్‌ శెట్టి.. బాక్సింగ్‌ కోచ్‌ గా మెస్మరైజ్‌ చేశాడు. అటు.. జగపతి బాబు నెగిటివ్‌ పాత్రలో జీవించేశాడు. ఇక బాక్సింగ్‌ కోసం వరుణ్‌ పడే.. కష్టాన్ని మొత్తం ట్రైలర్‌ లోనే చూపించారు. కాగా… ఈ సినిమా ఏప్రిల్‌ 18 కి విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news